డీఏవీ స్కూల్ వ్యవహారంలో రోజుకో మలుపు..!

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

ఘటనపై విచారణ జరిపేందుకు డీఏవీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్స్ టీమ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది.

మరోవైపు పాఠశాల రద్దుపై తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తగ్గడం లేదు.కాగా విద్యార్థుల తల్లిదండ్రులు నేడు విద్యాశాఖ కమిషనర్ ను కలవనున్నారు.

స్కూల్ ను రద్దు చేయవద్దంటూ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.అయితే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో స్కూల్ గుర్తింపును సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఘటనపై సొంత కమిటీతో విచారణ జరిపించుకున్న యాజమాన్యం.ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

అంతేకాకుండా ప్రైమరీ సెక్షన్ అనుమతులతో 7వ తరగతి వరకు నిర్వహిస్తున్నట్లు ఇది వరకే అధికారులు గుర్తించారు.ఈ క్రమంలో నిబంధనలు యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

Advertisement

తాజా వార్తలు