టార్గెట్ వైసిపి ! జగన్ కు ఎన్నో ప్రశ్నలు వేసిన పురందరేశ్వరి

ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తను నోటికి పని చెప్పారు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggupati purndareswari ).

వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నో విమర్శలు చేయడంతో పాటు , జగన్ కు అనేక ప్రశ్నలు సందించారు.

ఈ సందర్భంగా జనసేనతో పొత్తు అంశాన్ని ఆమె ప్రస్తావించారు.బిజెపి టార్గెట్ పూర్తిగా వైసిపి నే అనే విషయాన్ని తన విమర్శల ద్వారా పురందరేశ్వరి చెప్పకనే చెప్పారు.

ఈరోజు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ ఆఫీసుకు చేరుకున్న పురందరేశ్వరి అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించారు.

ఏపీ అభివృద్ధికి బిజెపి ఎటువంటి సహకారం అందించిందో వివరించారు.

Advertisement

కేంద్రం అండదండలతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని,  ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని , ఏపీకి ప్రధాని ఆవాస్ యోజన కింద 22 లక్షలకు పైగా ఇళ్లను కేంద్రం కేటాయించిందని , దీనిపై మీరు పేదలకు ఇచ్చే సమాధానం ఏమిటని జగన్ ను ప్రశ్నించారు.ఏపీకి పెట్టుబడులు రావడంలేదని , ఉన్నవి తరలిపోతున్నాయని విమర్శించారు.ఏపీ పునర్వభజన చట్టం ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యా సంస్థలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందని,  ఎయిర్ పోర్టుల విస్తరణ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరిగిందని,  విజయవాడ ఎయిర్ పోర్ట్ విస్తరణ తో పాటు,  రాష్ట్రవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

ఏపీలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సరిగా కృషి చేయడం లేదని , సీఎం జగన్( CM JAGAN ) ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు 12 వేలు ఇస్తామని అన్నారని దానిపై ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు .

కేంద్రం ఇస్తున్న 6000 ఎందుకు చెప్పడం లేదని , రైతులను సీఎం మోసం చేస్తున్నారని పురందరేశ్వరి విమర్శించారు.ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎటువంటి జాప్యం చేయడం లేదని, ఈ మధ్యనే 12 వేల కోట్లు పోలవరానికి కేంద్రం ఇచ్చిందని , ప్రాజెక్టును కట్టడం కుదరకపోతే కేంద్రానికి అప్పజెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ఆమె ప్రశ్నించారు.

మహిళలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.ఈ సందర్భంగా జనసేనతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆ వ్యవహారాన్ని పార్టీ పెద్దలు చూసుకుంటారని చెప్పారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తో సోము వీర్రాజు మాట్లాడుతూనే ఉండే వారిని పురందరేశ్వరి అన్నారు.

Advertisement

తాజా వార్తలు