జీలకర్ర నీటితో అధిక బ‌రువుకు సులువుగా చెక్ పెట్టండి!!

అధిక బ‌రువు.నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొనే ప్ర‌ధాన స‌మ‌స్య‌.

ముఖ్యంగా యువతరం మీద ఈ స‌మ‌స్య తీవ్రంగా ప్ర‌భావం చూపిస్తోంది.

అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నోరు క‌ట్టేసుకుని తీవ్రంగా శ్ర‌మిస్తారు.

మ‌రియు ఎన్నో ర‌కాల డైట్లు, మ‌రెన్నో ర‌కాల మందులు కూడా వాడతారు.కానీ, ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.

వాస్త‌వానికి మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.ముఖ్యంగా మన డైలీ డైట్‌లో జీల‌క‌ర్ర నీటిని చేర్చుకుంటే ఖ‌చ్చితంగా బ‌రువు త‌గ్గొచ్చ‌ని నిపుణులు అంటున్నారు.

Advertisement

జీల‌క‌ర్ర‌.ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే ఔష‌ధం అన‌డంలో సందేహం లేదు.

వంట‌ల్లో విరివిరిగా వాడే జీల‌క‌ర్ర.చ‌క్క‌ని రుచి ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతుంది.

అలాగే బ‌రువు త‌గ్గేందుకు కూడా జీల‌క‌ర్ర గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.ముందు నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించాలి.అనంత‌రం ఈ నీటిని గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.

ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద‌యం ఈ నీటిని తీసుకుంటే. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మొబైల్ ఫోన్ రాత్రి పక్కన పెట్టుకొని నిద్రపోతే ప్రమాదమా.. ముఖ్యంగా పురుషులకు..

త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.సాధారణంగా వ్యాయామం చేస్తే తగ్గే కొవ్వు కంటే ఈ నీటిని తీసుకోవ‌డం వల్ల కరిగే కొవ్వు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట.

Advertisement

ఇక‌ కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఇది రోగ‌నిరోధక శ‌క్తిని పెంచుతుంది.డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ జీల‌క‌ర్ర నీటిని తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ర్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

తాజా వార్తలు