భద్రాద్రి జిల్లాలో గన్ మిస్ ఫైర్ .. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ ఫైర్ అయింది.

ఈ ప్రమాదంలో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ( CRPF DSP Seshagiri Rao ) మృతిచెందారు.

గన్ మిస్ ఫైర్ కావడంతో శేషగిరి రావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.దీంతో ఆయనను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అయితే శేషగిరి రావు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.ఈ ఘటన చర్ల మండలం పూసుగుప్ప గ్రామంలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో చోటు చేసుకుంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గన్ మిస్ ఫైర్ అయిందా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు