అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వింత ఘటన చోటు చేసుకుని.అసలు ఇలా కూడా జరుగుతుందా అంటూ అందరూ ఆశ్చర్య పోతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.ఫ్లోరిడాలోని బ్రేవార్డ్ కౌంటీ లో గల “ఫే లేక్” వైల్డర్‌నెస్ పార్కులో స్థానికంగా ఉన్న చెరువులో ఓ మహిళ స్నానం చేస్తుండగా హటాత్తు గా ఎనిమిది అడుగుల మొసలి ఒక్కసారిగా ఆ మహిళపై దాడి చేసింది.
ఇది గమనించిన సన్నిహితులు వెంటనే ఆమెని పైకి లాగేశారు.
మొసలి దాడి ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
ఒక్క సారిగా మొసలి ఆమెపై దాడి చేయడంతో ఆ ఊహించని పరిణామానికి ఆమె షాక్ కి లోనయ్యింది.దాంతో ఆమెని వెంటనే చికిత్స కోసం హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలిచారు.
అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న వైల్డ్ లైఫ్ అధికారులు ఆమెని పరామర్శిచారు.ఆమెకి ధైర్యం చెప్పారు.
ఆమె మెల్‌బోర్న్‌కు చెందిన నిఖొల్ ఏ.తిల్మన్‌గా గుర్తించారు.

ప్రస్తుతానికి ఆమె కోలుకుంటోందని తెలిపారు.అయితే వారు ఈ ఘటనకి సంభందించి చెప్పిన విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది.ప్రస్తుతం ఇది మొసళ్ళు సంభోగ చెందే కాలం కావడంతో మగ మొసళ్ళు ఇలానే దూకుడుగా ఉంటాయని తెలిపారు.ఆమెపై దాడి ఇందు కోసమే జరిగిందంటూ తెలిపారు.