క్రికెట్ అభిమానులారా! ఫిబ్రవరి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఎవరో మీకు తెలుసా?

క్రికెట్ అభిమానులారా! ఈ విషయం మీరు విన్నారా? లేదా? వినకపోతే ఇపుడు తెలుసుకోండి.2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఐసీసీ నిన్న అనగా మార్చి 13న ప్రకటిం‍చింది.

ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్‌ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌(Cricketer Harry Brooke) గెలుచుకున్నాడు.కేవలం మూడంటే మూడు నెలల వ్యవధిలోనే బ్రూక్‌ ఈ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పుకోవాలి.2022 డిసెంబర్‌లో కూడా బ్రూక్‌ ఈ అవార్డును గెలుచుకున్నారని మీకు తెలుసా?.

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(Pakistan captain Babar Azam) తర్వాత ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును 2 సార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్‌ కావడంతో అయన అభిమానులు సంబరాలలో మునిగితేలుతున్నారు.ఇక బాబర్‌ విషయానికొస్తే 2021 ఏప్రిల్‌లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు.2023, ఫిబ్రవరిలో బ్రూక్‌కు పోటీగా టీమిండియా ఆల్‌రౌండర్‌ అయినటువంటి రవీంద్ర జడేజా(Ravindra Jadeja), విండీస్‌ యువ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ(Gudakesh Moti) పోటీపడినప్పటికీ, ఆఖరిగా ఈ అవార్డు బ్రూక్‌నే వరించడం గమనార్హం.

బ్రూక్‌ ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన 2 టెస్ట్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలు, ఓ భారీ సెంచరీ కొట్టాడు.ఇక జడేజా విషయానికిఒటే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి 2 టెస్ట్‌ల్లో 2 ఫైఫర్లతో పాటు ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.అదేవిధంగా విండీస్‌ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ ఇండియన్‌ ఆరిజిన్‌ కలిగిన ఈ స్పిన్‌ బౌలర్‌ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టి షాకిచ్చాడు.

జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్‌కు ఓటింగ్‌ శాతం అధికంగా రావడంతోనే ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ఫిబ్రవరి మంత్‌ అవార్డుకు అతన్నే ఎంపిక చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

తాజా వార్తలు