తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి (Priyamani )ఒకరు.ఈమె హీరోయిన్ గా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ప్రియమణి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ప్రియమణి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్(Jawan) సినిమాలో కూడా సందడి చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ ప్రియమణి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వార్త విన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా మరోవైపు ఈ రూమర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర( Devara ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై మేకర్స్ స్పందించకపోవడంతో ఇది నిజమేనని అందరూ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్నారని , ఇందులో ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో నటి ప్రియమణి నటించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది.ఇక ఈ వార్త విన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఒకింత షాక్ అవ్వడమే కాకుండా ఈ వార్తలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి ప్రియమణి ఇప్పుడు ఆయనకు తల్లిగా నటించడం( Mother Role ) ఏంటి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అంటూ కొందరు ఈ వార్తలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మేకర్స్ స్పందించాల్సి ఉంటుంది ఇక ఎన్టీఆర్ ప్రియమణి, ఎన్టీఆర్ ఇద్దరు కూడా యమదొంగ (Yamadonga)సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.







