స్టార్ హీరోలు వరుస సినిమాలు కమిటైనా.. ఒక్కటంటే ఒక్కటి కూడా..

టాలీవుడ్ డైరెక్టర్లు ఫుల్ ఫామ్ లో ఉండడంతో ప్యాండమిక్ తర్వాత కూడా ఉత్సాహంతో పని చేస్తున్నారు.

అయితే స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి డైరెక్టర్లను ఖాళీగా కూర్చో బెడుతున్నారు.

కరోనా విరామం తో స్టార్ హీరోలంతా వరుసపెట్టి కథలు విని చాలా మంది డైరెక్టర్లకు ఓకే చెప్పారు.ఫ్యాన్స్ కూడా తమ హీరోల చేతిలో వరుస సినిమాలు ఉన్నాయని మురిసి పోయారు.

కానీ ఇప్పుడు సీన్ వేరేలా ఉంది.స్టార్ హీరోలంతా ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు.

అప్పుడు ఎలా పడితే అలా ప్రకటించి ఇప్పుడు మళ్ళీ కథల విషయంలో చర్చలు జరిపి డైరెక్టర్లను హోల్డ్ లో పెడుతున్నారు.దీంతో ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.అసలు అవుతుందో లేదో అనే పరిస్థితి నెలకొంది.

Advertisement

అందుకే ఫ్యాన్స్ కూడా స్టార్ హీరోలు అధికారిక ప్రకటన వచ్చిన అది సెట్స్ మీదకు వెళ్లెవరకూ ఆ సినిమా పై అంచనాలు పెట్టుకోవడం లేదు.మెగాస్టార్ వరుస సినిమాలు లైన్లో పెట్టాడు.

అయితే ఆచార్య ఇచ్చిన ప్లాప్ తో ఇప్పుడు ఆలోచనలో పడి ఒకటికి రెండుసార్లు అలోచించి ముందుకు వెళుతున్నాడు.ఇక పుష్ప తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ దాన్ని కాపాడు కోవాలి అనే ప్రయత్నంలో ఆచితూచి ముందుకు వెళుతున్నాడు.

అందుకే అందుకు ముందు కమిట్ అయినా సినిమాలను ఇప్పుడు పట్టించు కోవడం లేదు.ఇక ఇటీవలే లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అట్టర్ ప్లాప్ ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ కూడా జేజిఎమ్ ను పూర్తిగా పక్కన పెట్టేసాడు.ఖుషి తర్వాత ఏ డైరెక్టర్ తో కమిట్ అవుతాడో అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు ఏ షూటింగ్ లో పాల్గొంటాడో ఆయనకే తెలియదు.ప్రకటించిన సినిమాలు సెట్స్ మీదకు వెళ్లెవరకూ కష్టమే.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు