భూపోరాటాలతో వరంగల్ జిల్లా అట్టుడికి పోతోంది సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బినోయ్ విశ్వం

భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఇండ్లు లేని పేదలు గుడిసెలు వేసుకుంటే అడ్డుకుంటున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బినోయ్ విశ్వం ఆరోపించారు.

బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న విశ్వంను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.

సీపీఐ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకొంది.పోలీస్ వ్యతిరేక నినాదాలతో సీపీఐ కార్యకర్తలు హోరెత్తించారు.


అనంతరం బినోయ్ విశ్వంతో పాటు సీపీఐ నాయకులను పోలీసులు అదుపుకులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

వరంగల్ లో చెరువులు కుంటలు అక్రమిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు.పేదప్రజలకు కేసిఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం హామీ నెరవేర్చకపోవడం మూలంగానే పేదలు రోడ్డెక్కారని ఆరోపించారు.

Advertisement

ప్రజలకు ఇచ్చిన హామీని నేరవెర్చలేని కేసిఆర్ కు పాలించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు