కరోనా కొత్త మెడిసిన్ ఓపెన్ చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి..!!

భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే.

రోజుకి లక్షల్లో కేసులు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి.

మరోపక్క మహమ్మారి ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు.భయంకరంగా వైరస్ విస్తరిస్తూ ఉండటంతో బెడ్లు కొరతతో పనులు ఆక్సిజన్ అందక అనేకమంది కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.

Covid New Medicine 2 DG Released By Rajnath Singh, Corona New Medicine, Rajnaths

పరిస్థితి ఇలా ఉండగా కరోనా కి చెక్ పెట్టే రీతిలో డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ మెడిసిన్ తయారు చేసిన విషయం తెలిసిందే.దానికి 2 డిజీ అనే నామకరణం కూడా చేయడం జరిగింది.

గ్లూకోజ్ పౌడర్ రూపంలో మెడిసిన్ ఉంటుందని కచ్చితంగా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే రీతిలో పనిచేస్తుందని ఇప్పటికే దీనిపై వార్తలు రావడం జరిగాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెడిసిన్ ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ వీడియో విధానం ద్వారా ఓపెన్ చేశారు.

Advertisement

మొదటిగా దీని ఢిల్లీలో డిఆర్డిఓ హాస్పిటల్ రోగులకు అందించనున్నారు.ఖచ్చితంగా ఇండియాలో కరోనా ని కట్టడి చేయడంలో ఈ 2 డిజీ ఔషధం గేమ్ చేంజర్ అవుతుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 .

Advertisement

తాజా వార్తలు