స్కిల్ డెవలప్మెంట్ కేసులో( skill development ) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu )రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపు నెల రోజులు కావస్తోంది.
ఈ క్రమంలో ఇటీవల ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్ కి గురికావడం కూడా జరిగింది.దీంతో చంద్రబాబు ఆరోగ్యం పై తెలుగుదేశం పార్టీ కేడర్ మరియు కుటుంబం ఆందోళన చెందుతూ ఉంది.
ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు గదిలో ఏసీ పెట్టించాలని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయగా.తాజాగా కోర్టు అనుమతి ఇచ్చింది.
జైల్లో చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.జైల్లో చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఎండల కారణంగా డీహైడ్రేషన్ గురవటంతో స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు తరుపు లాయర్లు ఇవాళ ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.వెంటనే ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొన్నారు.
దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం జైల్లో చంద్రబాబు బ్యారెక్ లో వెంటనే ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.