పిల్ల‌ల కోసం వేశ్య‌ను బ‌లిచ్చిన దంప‌తులు.. చివ‌ర‌కు..

ప్ర‌తి మ‌నిషి జీవితంలో పిల్ల‌లు అనే బాధ్య‌త క‌చ్చితంగా ఉంటుంది.ఈ బంధం కోసం ఎంతో త‌పిస్తుంటారు దంప‌తులు.

ఇక మన దేశంలో అయితే కాస్తంత దైవ‌త్వ న‌మ్మ‌కాలు ఎక్కువ కావ‌డంతో ఎంత‌గా ప్ర‌పంచం సైన్స్ వైపు వెళ్తున్నా మ‌న దేశ‌స్తులు మాత్రం ఇంకా పిల్ల‌ల కోసం పూజ‌లు, వ్రతాల్లాంటివి చేస్తూనే ఉన్నారు.ఎంత‌లా వైద్య రంగం అభివృద్ధి చెందినా కూడా వీరు మాత్రం ఇలాంటి మూడ న‌మ్మ‌కాల‌ను మాన‌ట్లేదు.ఇంకా కొంద‌రైతే భూత వైద్యుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏవేవో చేస్తుంటారు.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ దారుణమే జ‌రిగింది.ఓ జంట పిల్ల‌ల కోసం మూఢనమ్మకంతో ఏకంగా నిండు ప్రాణం బ‌లి తీసుకుంది.

మధ్యప్రదేశ్ లో ఈ ఉదంతం చోటుచేసుకున్న‌ట్టు తెలుస్తోంది.ఈ జంట ఏకంగా త‌మ‌కు సంతానం క‌ల‌గ‌డం కోసం ఓ భూత వైద్యుడి స‌ల‌హా మేర‌కు నరబలి ఇచ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే గ్వాలియర్ ప్రాంతానికి చెందిన‌టువంటి బంటు బదౌరియా మమతా భార్య‌భ‌ర్తలు.వీరికి 18 ఏండ్ల క్రింద వివాహం కాగా ఇప్పటి దాకా సంతానం లేదు.

అయితే త‌మ‌కు ద‌గ్గ‌రి ఫ్రెండ్ స‌ల‌హా మేర‌కు ఓ భూతవైద్యుడిని అడ‌గ్గా ఆయ‌న న‌ర‌బ‌లి ఇస్తేనే పిల్ల‌లు పుడ‌తారని చెప్పాడు.

దీంతో ఓ వేశ్య‌ను ఇస్తేనే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని వారు న‌మ్మి స్నేహితుడు నీర‌జ్ సాయం తో ఓ వేశ్య‌ను బ‌లిచ్చారు.అయితే ఆ మృత‌దేహాన్ని త‌ర‌లించే క్ర‌మంలో కింద ప‌డిపోగా వారు భ‌య‌ప‌డి పోయారు.ఆ త‌ర్వాత మ‌రో వేశ్య‌ను తీసుకొచ్చి బ‌లిచ్చారు.

అయితే మొద‌ట తీసుకొచ్చిన వేశ్య మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించి ద‌ర్యాప్తు చేయ‌గా ఆమె కాంటాక్ట్ లిస్ట్ ను ప‌రిశీలించి నిందితుల‌ను అద‌పులోకి తీసుకున్నారు పోలీసులు.ఇక పోలీసుల స్టైల్‌లో ద‌ర్యాప్తు చేయ‌గా అస‌లు నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీంతో ఈ విష‌యం కాస్తా ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు