సూటుకేసులో శవం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ అసలు నిజం..

రోజురోజుకూ నేరాలు ఎక్కువవుతున్నాయి.చిన్న విషయాలకు కూడా ఒక మనిషిని చంపే వరకు వెళ్తున్నారు.

అయితే పోలీసులు చెప్పే ఘనాంకాల ప్రకారం వివాహేతర సంభంధాల వల్ల ప్రేమ వివాహాల వల్లే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల గొడవలు ప్రారంభమవుతాయి.

ఆ గొడవలు కాస్తా చంపుకోవడం దాకా వెళ్తుంది.భర్త భార్యను చంపడమో లేదా భార్య భర్తను చంపడమే లేకపోతే భార్య భర్తలు కలిసి మూడో వ్యక్తిని చంపడమో జరుగుతున్నాయి.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా ఈ కోవకే చెందుతుంది.భార్యాభర్తలు కలిసి మూడో వ్యక్తిని చంపేశారు.

Advertisement

తరువాత సూటుకేసులో పెట్టి మురికి కాల్వలో పడేసారు.చుట్టుపక్కల వారు వాసనా రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయాన్నీ రాబట్టారు.బీహార్ రాష్ట్రానికి చెందిన వినోద్ కుమార్, ప్రీతీ ఇద్దరు భార్య భర్తలు.

వీరు ఉపాధికోసం ఉత్తరప్రదేశ్ రాస్ట్రానికి వలస వెళ్లారు.ఘజియాబాద్ లో కాపురం పెట్టి అక్కడ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే అదే ప్రాంతానికి చెందిన త్యాగి అనే వ్యక్తి దగ్గర ఆ దంపతులు లక్ష 40 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అప్పుగా తీసుకున్న వ్యక్తికి సకాలంలో అప్పు తీర్చలేకపోయారు.దీనిని అలుసుగా తీసుకుని త్యాగి వినోద్ కుమార్ లేనప్పుడల్లా అతడి ఇంటికి వెళ్లి అప్పు గురించి మాట్లాడి తన కోరిక తీరిస్తే అప్పు విషయం మర్చిపోతానని చెప్పేవాడు.త్యాగి తనతో అక్రమ సంభందం పెట్టుకోవాలని ప్రీతిని బలవంతం చేసాడు.

Advertisement

అప్పు తీర్చకపోతే పంచాయతీ పెట్టిస్తానని బెదిరించాడు.దీంతో ప్రీతీ వేరే గత్యంతరం లేక త్యాగితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.

ఈ విషయం గురించి తెలిసి వినోద్ కుమార్ భార్యను నిలదీసాడు.దీంతో ప్రీతీ మనకు అప్పు తీర్చే మార్గంలేదని అందుకే ఆయన బెదిరింపులకు లొంగిపోవాల్సి వచ్చిందని తెలిపింది.

దీంతో ఆగ్రహానికి లోనైనా వినోద్ త్యాగిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.త్యాగిని విందుకోసమని ఇంటికి పిలిచి బాగా తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు.

ఆ తర్వాత శవాన్ని ఒక సూట్ కేస్ లో పెట్టి డ్రైనేజీ కాలవలో పడేసారు.త్యాగి కుటుంబ సభ్యుల ఆయన కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

డ్రైనేజ్ కాలవలో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆ సూట్ కేస్ లో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు.

అది త్యాగి మృతదేహమని నిర్దారించుకుని విచారణ మొదలుపెట్టారు.సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా త్యాగి చివరగా వినోద్ ఇంటికి వెళ్లినట్లు గుర్తించి విచారిస్తే అసలు నిజం ఒప్పుకున్నారు.

భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

తాజా వార్తలు