వైట్ హౌస్ కీలక అధికారి సంచలన వ్యాఖ్యలు..గ్రామాలకి కూడా..

అందుగలదు.ఇందు గలదు అనే సందేహం వలదు.

ఎందెందు వెతికినా అందందే కలదు అన్నట్టుగా ఎటు చూసిన కరోనానే, ఏమి ముట్టుకున్నా, గాలి పీల్చినా కరోనా భయమే.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజర్లు పూసుకుని కరోనా మహమ్మారి మధ్యనే సహా జీవనం చేస్తున్నారు.

అగ్ర రాజ్యమనే తేడా లేదు, పేద , ధనిక నే భేదం లేదు అందరిని ఓ ఆట ఆడేసుకుంటోంది కరోనా మహమ్మారి.కిక్కిరిసి జనాలు ఉండే పట్టణ ప్రాంతాలే కాదు కల్మషం లేని గ్రామీణ ప్రాంతాలకి సైతం ఈ కరోనా చొచ్చుకుపోతోంది.

పట్టి పీడిస్తోంది.అమెరికా వైట్ హౌస్ కీలక అధికారి ఒకరు కరోనా మహమ్మారి కేవలం అమెరికాలోని పట్టాణాలలో మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా జూలు విదుల్చుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దేశంలో అని ప్రాంతాలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ క్రమంలోనే గవర్నర్ల తో కలిసి ప్రజారోగ్య సంస్థ పనిచేయడానికి సిద్దమయ్యిందని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ డేబోరా బిక్స్ తెలిపారు.ప్రస్తుతం అమెరికన్లు కరోనాకు సంభందించి కొత్త ఫేస్ లో ఉన్నారని ఆయాన తెలిపారు.

గడించిన నెలలుగా చూస్తే కరోనా ప్రస్తుతం గతంలో కంటే ఎంతో బలంగా మారుతోందని అన్నారు.కరోనా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం చూపుతోందని తమకి అందిన నివేదికల ప్రకారం గ్రామీణ ప్రాంతాల వారు డేంజర్ జోన్ లో ఉన్నారని తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఫేస్ మాస్క్ లు ధరించాలని తెలిపారు.ఇప్పటికే 14 రాష్ట్రాలలో పర్యటించానని అన్ని చోట్లా పరిస్థితులు చేయి దాటనున్నాయని అన్నారు.

వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోక పొతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు