గాంధీ ఆసుపత్రికి క్యూ కట్టిన కరోనా అనుమానితులు!!

కరోనా వైరస్.ప్రపంచాన్ని వణికించేస్తోంది ఈ వైరస్.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో మూడు వేలమందికిపైగా మరణించారు.

ఇక వేలమంది కరోనా వైరస్ బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంకా అలాంటి కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లోకి వ్యాపించి ప్రజలను బయపెట్టేస్తుంది ఇప్పటికే కరోనా వైరస్ భారిన 30 పడ్డారు.ఈ నేపథ్యంలోనే కరోనా అనుమానితులు హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

రోజుకు 10 మందికి పైనే ఆస్పత్రిలో చేరుతున్నారు.ఈ నేపథ్యంలోనే గండి ఆస్పత్రిలో ఏడుగురు కరోనా వైరస్‌ అనుమానితులు అడ్మిట్‌ అయ్యారు.

Advertisement

దీంతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో అనుమానితుల సంఖ్య 37కు చేరింది.నగరంలోని గాంధీ ఆసుపత్రి, ఫీవర్‌ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నవారి సంఖ్య 618కి చేరింది.

ఇక గాంధీ ఆసుపత్రిలో 215 మందికి టెస్టులు జరపగా వారిలో 169 మందికి నెగటివ్‌ రిపోర్టు వచ్చిందని వైద్యా ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.అందుకే ప్రజలు కాస్త ముందుజాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని అధికారులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు