విజృంభిస్తున్న కరోనా,మూతపడ్డ సరిహద్దులు!

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

 Rajasthan To Seal Border For A Week As Coronavirus Cases Rise, Coronavirus, Raja-TeluguStop.com

ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

కేవలం పాస్ లు ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిని ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రాజస్తాన్‌కు యుపి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలు సరిహద్దులుగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రం నుండి వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కచ్చితంగా పాస్‌లు ఉండాల్సిందేనని డిజిపి తెలిపారు.

సంబంధిత పాస్‌లను కలెక్టర్లు, ఎస్‌పిల నుండి తీసుకోవాలని అన్నారు.సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌లు (ఎన్‌ఒసి) ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని నిర్నయించినట్లు తెలుస్తుంది.

అలానే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లలో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.కాగా, రాజస్తాన్‌లో బుధవారం తాజాగా 123 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

దీనితో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,300 కు చేరగా,మృతుల సంఖ్య 256 కు చేరినట్లు తెలుస్తుంది.మరోపక్క దేశంలోని మహారాష్ట్రలో కూడా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

రోజు రోజుకు అక్కడ కేసులు పెరిగిపోతుండటం తో మరో చైనా తలపించేలా ఆ రాష్ట్ర పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube