ఇకపై మందుల షాపులో కోవాగ్జిన్, కోవిషీల్డ్ మందులు..!

కరోనా వైరస్ వలన దేశంలోని ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.చాలామంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.

ఇప్పటికి కరోనా వైరస్ తన వ్యాప్తిని కొనసాగిస్తూనే ఉంది.కరోనాని కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వం వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

కొవీషీల్డ్, కొవాగ్జిన్ అనే రెండు టీకాలను రెండు డోస్ ల రూపంలో వేయించుకోవాలని ప్రజలకు సూచనలు కూడా జారీ చేసాయి.అయితే ఈ వాక్సిన్లు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిధిలోనే ఉండేవి.

కానీ ఇప్పుడు కోవి షీల్డ్, కొవాగ్జిన్ వాక్సిన్ లను రెగ్యూలర్ గా మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి డ్రగ్ యాజమాన్యాలు.ఈ నేపథ్యంలో ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ నుంచి అప్రూవల్ కూడా తెచ్చుకున్నాయి.

Advertisement

అయితే ఇదే కనుక అప్రూవ్ అయితే ఒకవేళ వాక్సిన్ అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే కొనుకోవాలనే కండిషన్ ఉండదు.ఎప్పుడు పడితే అప్పుడు కొనుకోవచ్చు అన్నమాట.

కాగా సబ్జక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ నుంచి అప్రూవల్ వచ్చిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లు చెప్తున్నాయి.

ఈ విషయాన్ని స్వయంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటన కూడా చేసాయి.సీఈసీ కొవీషీల్డ్, కొవాగ్జిన్ స్టాటస్ ను అప్ గ్రేడ్ చేసినట్లు తెలుస్తుంది.గతంలో ఉన్న మాదిరిగా అత్యవసర పరిస్థితులలో మాత్రమే వాడకానికి అనుమతిని రిస్ట్రిక్టెడ్ యూజ్ కు ఓకే చెప్పింది.

అయితే ఇప్పటివరకూ ఎవరు అయినాసరే వాక్సిన్ వేపించుకుంటే అందుకు సంబదించిన వివరాలను కొవిన్ యాప్ లో పొందుపరచాల్సి ఉండేది.అంటే వాక్సిన్ వాడకం క్లినిక్స్, హాస్పిటల్స్ లో ఎక్కడైనా వేయించుకున్న కొవిన్ యాప్ లో తప్పనిసరిగా రిజిష్టర్ అయి ఉండాలి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు