కరోనా ఎఫెక్ట్: ఒక పూరింటి రెండు నెలల కరెంట్ బిల్లు ఎంతంటే!

కరోనా మహమ్మారి ఏమో గానీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.

సెలబ్రిటీలు అంతో ఇంతో వెనకేసుకొని ఎదో అలా కాలం గడుపుతున్నారు.

అయితే పేదలు మాత్రం రెండు పూటలా తిండి తినడానికే నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల తిండి సంగతి పక్కన పెడితే కరెంట్ బిల్లుల విషయంలో పేదవారికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.

ఏమీ లేకుండా ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటున్న వారికి వేలల్లో కరెంట్ బిల్లులు రావడం వారిని ఆందోళనకు గురిచేస్తుంది.ఏపీ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏమీ లేని ఒక పూరి ఇంటి కి కరెంట్ బిల్లు ఏకంగా 41 వేల రూపాయలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామం ఛాన్వి అనే మహిళ ఓ గుడిసెలో ఉంటూ బీడీలు చుడుతూ నివసిస్తోంది.

Advertisement

అయితే ఆమె ఇంటిలో ఒక టీవీ, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి.కేవలం ఆ మాత్రమే ఉన్న ఆ ఇంటికి కరెంట్ బిల్లు ఎంతొచ్చిందో తెలుసా.

ఏకంగా 41,149 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది.గత నెల కరోనా వల్ల ఎవరూ కూడా వచ్చి కరెంట్ రీడింగ్ తీయనందున రెండు నెలల బిల్లు ఒకేసారి వస్తుంది.

అయితే మరి కనీస ఎలక్ట్రికల్ వస్తువులు లేకుండానే ఆ చిన్న పూరింటికి ఇంత మొత్తం బిల్లు రావడం తో అందరూ ఆశ్చర్యపోయారు.అయితే కరెంట్ బిల్లు ఎంతవచ్చిందో తెలియక ఛాన్వి బిల్లు కట్టడానికి సిద్దమైంది.

అయితే బిల్లు చూసిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.కనీసం కడుపునిండా భోజనానికే ఇబ్బంది పడే ఆ ఇంటికి ఇంత మొత్తంలో బిల్లు రావడం తో ఆమె బిల్లును చూసి హడలిపోయింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

పూట గడవడమే కష్టంగా ఉంటే తాను అంత పెద్ద మొత్తం ఎలా చెల్లించేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.రెండు నెలలకే ఇంత బిల్లు రావడంపై ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Advertisement

చుట్టు పక్కల గ్రామాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు