తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో 27,348 మందికి కరోనా పరీక్షలు నిర్వ‌హించ‌గా, 406 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఒక్కరోజు వ్యవధిలో 494 మంది కోలుకున్నారు.కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉంద‌ని వెల్ల‌డించారు.

Corona Cases Increased Again In Telangana , Corona Cases, Health Builten, Increa

అటు హైదరాబాద్ లో అత్యధికంగా 177 కేసులు న‌మోద‌య్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వ‌చ్చాయి.రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 8,29,873 పాజిటివ్ కేసులు నమోదు కాగా.8,22,667 మంది కోలుకున్నారని వైద్యాధికారులు వెల్ల‌డించారు.అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4, 111 గా ఉందని పేర్కొన్నారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు