తెలంగాణలో కరోనా @ 2,123 కేసులు

తెలంగాణాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి బారినపడే సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

ఇప్పటికే చాల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

సామాన్య ప్రజల నుండి ఉన్నత స్థాయి వారి వరకు అందరు ఈ మహమ్మారి పేరు చెబితేనే భయపడి పోతున్నారు.ఇక ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

ప్రజలు ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు కోవిడ్ నియమాలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి.అయితే తాజాగా కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

Advertisement

ఇక రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 54,459 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.ఈ నిర్దారణ పరీక్షల్లో 2,123 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,34,409 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు.ఇక అందులో 1,69,169 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24గంటల్లో ఈ వైరస్ కారణంగా 11 మంది మృతి చెందినట్లు తెలిపారు.దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,025కి చేరిందని తెలిపారు.

ఇక ఇప్పటివరకు ఈ మహమ్మారి బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న వారి సంఖ్య 1,37,508కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 కరోనా కేసులు యాక్టివ్‌ లో ఉన్నాయని వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అంతేకాకుండా 24,070 మంది చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు