కొత్తిమీర. మన భారతీయులు విరి విరిగా ఉపయోగించే ఆకు కూరల్లో ఇది ఒకటి.
వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కాస్త కొత్తిమీర వేస్తే.ఆ వంటకం రుచి, వాసన అదిరిపోతాయి.
అలాగే కొత్తిమీరలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి కూడా కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్యానికి మాత్రమే కాదు.చర్మ సౌందర్యాన్ని సంరక్షించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా బ్లాక్ హెడ్స్‌ను మటుమాయం చేసి.చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కొత్తిమీర గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి కొత్తిమీరను ఎలా చర్మానికి యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొత్తిమీర పేస్ట్, ఓట్స్ పొడి మరియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే.
బ్లాక్ హెడ్స్ పోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
అలాగే కొత్తిమీర తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి.
ఆ రసంలో దోసకాయ రసం మరియు నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో ముఖానికి అద్దుకుని.బాగా ఆరిన తర్వాత కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు వల్ల బ్లాక్ హెడ్స్ పోతాయి.మరియు చర్మం మృదువుగా మారుతుంది.
ఇక కొత్తిమీర నుంచి రసం తీసుకుని అందులో కలబంద జెల్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి.పావు గంట పాటు వదిలేయాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
బ్లాక్ హెడ్స్ దూరం అవ్వడంతో పాటు చర్మ ఛాయ పెరుగుతుంది.