పక్షుల వల్ల పంట నష్టం కలుగకుండా అనుసరించాల్సిన పద్ధతులు..!

జొన్న, మొక్కజొన్న, దానిమ్మ, జామ లాంటి పంటలకు పక్షుల బెడద చాలా ఎక్కువ.

రైతులు ( Farmers ) విత్తనం నాటినప్పటినుంచి పంట చేతికి వచ్చేవరకు ఈ పక్షులు ( Birds ) పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

పక్షుల నుండి పంటలను సంరక్షించుకోవడం కోసం కొన్ని ప్రత్యేక పద్ధతులు తెలుసుకొని పాటించాలి.అందుకు సంబంధించిన పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

పంట ఎత్తుకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర, దక్షిణ దిశలలో పొలంలో పాతుకోవాలి.ఎరుపు, తెలుపు రంగును కలిగి ఉండే ఒక అంగుళం వెడల్పు, 30 అడుగుల పొడవు గల రిబ్బన్ ను రెండు లేదా మూడు మెలికలు తిప్పి కర్రలకు పది మీటర్ల దూరంలో కట్టుకోవాలి.

పొలానికి పక్షుల బెడద కాస్త ఎక్కువగా ఉంటే కర్రల మధ్య దూరం ఐదు మీటర్లకు తగ్గించి ఈ రిబ్బన్( Ribbon ) కట్టాలి.సూర్యరశ్మి రిబ్బన్ పై పడి దగదగా మెరుస్తూ గాలివీచినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది.ఈ శబ్దానికి భయపడి పక్షులు ఆ పొలం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఉండవు.

Advertisement

వేప గింజల( Neem Seeds ) నుండి కషాయం తయారు చేసుకొని పంటపై పిచికారి చేసి పంటను సంరక్షించుకోవచ్చు.ముందుగా బాగా ఎండిన వేప గింజ పై పొట్టును వేరు చేసి గింజలను మరలా ఒక రోజు ఎండలో ఆరబెట్టాలి.

ఆ తర్వాత ఈ గింజలను పొడి చేసుకుని పంటకు పిచికారి చేయాలి అనుకునే ఒక రోజు ముందు ఓ పలుచటి గుడ్డలో ఈ పొడి ఉంచి, ఒక పాత్రలో తగినంత నీరు తీసుకొని అందులో ఈ పొడి ఉన్న మూటను చేయాలి.ఒకరోజు గడిచిన తరువాత ఆ పొడి నుంచి కషాయం తయారవుతుంది.ఒక లీటరు నీటిలో 20 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని కలిపి పంటపై పిచికారి చేస్తే.పక్షుల నుండి పంటలను రక్షించుకోవచ్చు.

కుళ్ళిన కోడిగుడ్లను సేకరించి, అందులోని ద్రావణాన్ని ఒక లీటరుకు 25 మిల్లీలీటర్లు తీసుకుని గింజలు పాలు పోనుకునే దశలో పంటపై పిచికారి చేయాలి.ఈ వాసనకు పక్షులు పంటను ఆశించలేవు.

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు 
Advertisement

తాజా వార్తలు