నిరంతరం బ్యాంకు లావాదేవీలతో గడిపే వారికి, ప్రతి చిన్న పనికి బ్యాంకుకు పరిగెత్తే వారికి షాకింగ్ న్యూస్.ఈ నెలలో బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్న విషయాన్ని గమనించగలరు.
దీనిని ఖాతాదారులు గమనించకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.ఎందుకంటే వరుసగా బ్యాంకుకు సెలవులు వస్తుండటంతో ఏటీయంలలో కూడా డబ్బుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.
కాబట్టి ముందు జాగ్రత్తగా సరిపడా డబ్బులను డ్రా చేసుకుని పెట్టుకోగలరు.
ఇకపోతే బ్యాంకుకు వచ్చే సెలవుల వివరాలను తెలుసుకుంటే.
మార్చి 11న మహా శివరాత్రి, 13న రెండో శనివారం, 14న ఆదివారం, ఇక 15, 16వ తేదీలలో బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.దీంతో 15, 16వ తేదీలలో కూడా బ్యాంకులు పని చేయవు.
అంటే మార్చి 11 వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులుండగా మార్చి 12 వ తేదీ ఒక్కరోజే బ్యాంకులు పని చేస్తాయి.కాబట్టి ముందు జాగ్రత్త పడమని బ్యాంకు ఖాతాదారులకు తెలియచేస్తున్నారు.