చిన్నారుల ప్రాణం తీసిన కంటెయినర్.. రాజస్థాన్​లో విషాదం.. ?

ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో, ఎవరి దరికి చేరుతుందో ఊహించడం కష్టం.మరణానికి వయస్సుతో సంబంధం లేకుండా పసి వారిని కూడా తన పొట్టన పెట్టుకుంటుంది.

నిజంగా విధి విచిత్రం అంటే ఇదే కావచ్చూ.అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారులను మృత్యువు తన వొడిలోకి తెలియకుండానే ఆహ్వానించడం అంటే.

Container That Took The Lives Of Children Tragedy In Rajasthan Rajasthan, 8 Chi

ఇకపోతే బికనీర్ జిల్లాలోని హిమ్మతసర్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఆడుకుంటూ పక్కనే ఉన్న కంటెయినర్ లోకి వెళ్లారు.ఈ క్రమంలో కంటెయినర్ మూసుకుపోవడంతో పిల్లలంతా అందులోనే చిక్కుకుపోయి ఊపిరాడక మరణించారు.

కాగా పిల్లలు మరణించిన విషయం తెలియని ఆ తల్లి కంగారు పడుతూ వారికోసం వెతుకుతున్న క్రమంలో కంటెయినర్ దగ్గరకు వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలు కనిపించారు.వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Advertisement

ఇదిలా ఉండగా ఝన్ ఝన్ లో జరిగిన మరో ఘటనలో ఆడుకుంటున్న పిల్లలపై మట్టిపెళ్లలు విరిగి పడడంతో ముగ్గురు చిన్నారులు మరణించారు.

వామ్మో.. బన్నీకి జోడీగా అంతమంది హీరోయిన్లా.. కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారా?
Advertisement

తాజా వార్తలు