శంఖు పుష్పాల‌ను ఇలా తీసుకుంటే ఆరోగ్యామే కాదు అందం కూడా పెరుగుతుంది!

శంఖు పుష్పాలు.వీటిని మీరు చూసే ఉంటారు.

నీలి రంగులో ఉండే ఈ పుష్పాలు చూపురుల‌కు అందంగానే కాదు.

బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌ను, ఔష‌ధ గుణాల‌ను సైతం క‌లిగి ఉంటాయి.

పురాతన కాలం నుంచి ఈ శంఖు పుష్పాలను సాంప్రదాయ మందుల్లో వాడుతున్నారు.బంగారం కంటే విలువైన‌విగా శంఖు పుష్పాల‌ను భావిస్తారంటే.

వాటి యొక్క గొప్ప‌ద‌నం గురించి స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు.ఈ నేప‌థ్యంలోనే శంఖు పుష్పాల‌ను చాలా మంది త‌మ డైట్‌లో చేర్చుకుంటారు.

Advertisement

ముఖ్యంగా శంఖు పుష్పాల‌ను ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే ఆరోగ్యామే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు శంఖు పుష్పాల‌ను ఎలా తీసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పది నుంచి ప‌దిహేను ఎండిన శంఖు పుష్పాలు, అర క‌ప్పు బాగా మ‌రిగించిన‌ వాట‌ర్ వేసుకుని ఓ ఇర‌వై నిమిషాల పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఈలోపు ఒక కొబ్బ‌రి బోండం నుంచి.కొబ్బ‌రి నీటిని మ‌రియు లేత‌ కొబ్బ‌రిని స‌ప‌రేట్ చేసి పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత గ్లాస్ తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న శంఖు పుష్పాల నీటిని పోయాలి.

అలాగే అందులో రెండు ఐస్ క్యూబ్స్‌, ఒక క‌ప్పు కొబ్బ‌రి నీరు, రెండు టేబుల్ స్పూన్ల లేత కొబ్బ‌రి, వ‌న్ టేబుల్ స్పూన్ నాన‌బెట్టుకున్న స‌బ్జా గింజ‌లు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని.తాగేయడమే.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఈ శంఖు పుష్పాల డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగ్గా మారుతుంది.జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.

Advertisement

దంప‌తుల్లో సంతాన స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.నిద్ర‌లేమి నుంచి విముక్తి ల‌భిస్తుంది.

కంటి చూపు పెరుగుతుంది.ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

ఏజింగ్ ప్రాజెస్ ఆల‌స్యం అవుతుంది.చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా మాయం అవుతాయి.

చ‌ర్మం య‌వ్వ‌నంగా కూడా త‌యార‌వుతుంది.

తాజా వార్తలు