సుకేష్ చంద్రశేఖర్ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రముఖ కంపెనీ రాన్ బాక్సి యజమాని భార్య అదితి సింగ్ ను మోసం చేసి దాదాపుగా 215 కోట్లు కాజేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు విషయంలో చంద్రశేఖర్ కు శిక్ష పడిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల పాటు ఇతడి పేరు ఎక్కడ చూసినా కూడా మారుమోగి పోయింది.
ఇక చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.ఇక ఈ కేసులో తనతో పాటుగా బాలీవుడ్ హీరోయిన్లు జాక్వలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహికి సంబంధాలు ఉన్నట్లు అతని వెల్లడించాడు.
కేవలం వారు మాత్రమే కాకుండా మరో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్ ల పై అతడు కన్ను పడిందట.వాళ్ళు ఎవరో కాదు సారా అలీ ఖాన్ఖాన్, జాన్వీ కపూర్, భూమీ పడ్నేకర్.
తాజాగా అందిన నివేదికల ప్రకారం చంద్ర శేఖర్ దోపిడి డబ్బును ఉపయోగించి సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, భూమి లకు విలాస వంతమైన బహు మతులు ఇవ్వాలని అనుకున్నాడట.ఆ విధంగా వారికి చెరువు అయ్యాడు అని ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది.
చంద్రశేఖర్ మొదటి భార్య లీనా ను పాల్ సెలూన్ కంపెనీ యజమానిగా చెప్పుకుంటూ జాన్వీ కపూర్ కు పరిచయం చేసుకుంది.గత ఏడాది జూలైలో బెంగళూరులో ఆ సెలూన్ ఓపెన్ చేయగా ఇందుకోసం దాదాపుగా 18.94 లక్షలు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది.ఆ డబ్బు తో పాటుగా విలువైన క్రిస్టియన్ డియోర్ బ్యాగ్ ని కూడా బహుమతిగా ఇచ్చింది.
అదేవిధంగా సారా అలీ ఖాన్ కు సూరజ్ రెడ్డి అనే పేరుతో చంద్రశేఖర్ మెసేజ్ లు పంపించి ఆమె కూడా సీరియస్ కారణం కూడా బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
కానీ సారా అలీ ఖాన్ అతడి నుంచి బహుమతులు తీసుకోవడానికి ఇష్టపడలేదు అని తెలిపింది.ఇక భూమీ పడ్నేకర్ కోసం పింకి ఇరానీ నీ రంగం లోకి దింపాడు.ఆమె న్యూస్ ఎక్స్ ప్రెస్ పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే చెప్పుకుంటూ ఆమెకు దగ్గర అయింది.
అంతే కాకుండా కంపెనీ చైర్మన్ అయిన సూరజ్ అలియాస్ చంద్రశేఖర్ మీకు పెద్ద అభిమానిని అని అందుకే కాదు బహుమతిగా ఇవ్వాలని అను కుంటున్నట్లు పింకీ భూమికి చెప్పింది.కానీ భూమి మాత్రం చంద్రశేఖర్ నుంచి ఎటువంటి బహుమతులు తీసుకోలేదని ఈడీ అధికారులకు వెల్లడించింది.