కాంగ్రెస్ చింత తీర్చిన చింతన్ శిబిర్ ! కీలక నిర్ణయాలు 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది.

పార్టీని ప్రక్షాళన చేసేందుకు, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఎలా అనే విషయంపైనే రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కాంగ్రెస్ కీలక నాయకులంతా పాల్గొన్న ఈ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ ప్రక్షాళనకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఎన్నికల్లో గెలిచేందుకు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయాలపైన ఒక క్లారిటీ కి వచ్చారు.

ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు తెగిపోయాయి అని, పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో పూర్తిగా మమేకం అయితేనే పార్టీకి పునర్ వైభవం వస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి వారికి కాంగ్రెస్ గురించి వివరించాలని రాహుల్గాంధీ ఈ సమావేశంలో సూచించారు.ఈ చింతన్ శిబిర్ లో రాహుల్ గాంధీ అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.

తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని, జీవితంలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదన చెప్పుకొచ్చారు.ఆగస్టు 15 నుంచి ఉద్యోగాలు ఇవ్వండి అన్న నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది.

Advertisement

అలాగే అక్టోబర్ 2వ తేదీ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జొడో యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ నాయకులంతా ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొనాలని ఈ సందర్భంగా సోనియా సూచించారు.

కాంగ్రెస్ పార్టీలో అందరి అభిప్రాయాలకు తగిన గౌరవం లభిస్తుందని, బిజెపి ఆర్ఎస్ఎస్ లో ఇది ఎక్కడా కనిపించదు అని రాహుల్ గాంధీ చెప్పారు.రాబోయే రోజుల్లో నిరుద్యోగం, అధిక ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ఆగస్టు 15 నుంచి ఉద్యోగాలు ఇవ్వండి అన్న నినాదంతో యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశం కంటే ముందుగానే జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా 20 తీర్మానాలను సిడబ్ల్యుసి ఆమోదించింది.

ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.అలాగే పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయాలని 23 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.అలాగే ఈవీఎంలను బ్యాన్ చేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కూడా ఈ సందర్భంగా ఆమోదించారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

పార్టీ పదవుల్లో 50 శాతం యువత కు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు.ఇంకా అనేక అంశాలకు సంబంధించి సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.మొత్తంగా చూస్తే ఈ చింతన్ శిబిర్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చేందుకు బాగా ఉపయోగపడిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు