తెలంగాణలో కాంగ్రెస్ తమ వల్లే గెలిచింది... వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో తమ వల్లే కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చిందని అన్నారు.

కేసీఆర్ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో YSRTP కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఇడుపులపాయలో కుమారుడు కాబోయే కోడలతో కలిసి వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడటం జరిగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 30 స్థానాలలో పదివేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది.మా పార్టీ పోటీ లేకపోవడమే అందుకు కారణం.

ఆ కృతజ్ఞత కాంగ్రెస్ లో కూడా ఉంది.అందుకే వారు తమ పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఇబ్బంది ఏమీ లేదని వైయస్ షర్మిల( YS Sharmila ) స్పష్టం చేశారు.

దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని అభివర్ణించారు.ప్రతి ఒక్కరికి భద్రత నిచ్చే పార్టీ.అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రేపే ఢిల్లీకి వెళుతున్నట్లు వైఎస్ షర్మిల మీడియాతో స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం మాత్రమే కాదు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా ఆమె తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ వాతావరణం ఉన్న కొద్ది వేడెక్కుతుంది.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు