కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుంది..: రాహుల్ గాంధీ

బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎం మద్ధతు ఇస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.అయితే కేసీఆర్ కారు నాలుగు టైర్లలో గాలి పోయిందని తెలిపారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.24 గంటలు మోదీ తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారన్నారు.మోదీ కలలో కూడా తనను వదలడం లేదన్న రాహుల్ గాంధీ తనపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

తనపై కుట్రపూరితంగా కేసులు పెట్టి లోక్ సభ నుంచి వెళ్లగొట్టారని తెలిపారు.మోదీకి వ్యతిరేకంగా పోరాడితే కేసులేనన్న ఆయన కేసీఆర్ పై మాత్రం ఎలాంటి కేసులు లేవని విమర్శించారు.

కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని తెలిపారు.ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్, దేశంలో మోదీ ఉండాలని ఎంఐఎం కోరుకుంటోందని వెల్లడించారు.అయితే కేసీఆర్, మోదీని ఓడించడమే కాంగ్రెస్ ముఖ్య కర్తవ్యమని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!
Advertisement

తాజా వార్తలు