ప్రశాంత్ కిషోర్ చేరితే కలిసొచ్చేనా ? 

గతంతో పోలిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఏదైనా సరే 2024లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం సంపాదిస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

దీనికి తగ్గట్టుగానే రాహుల్ గాంధీ స్పీడ్ పెంచారు.కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

సీనియర్లను సైతం పక్కనపెట్టి యువ నాయకులకు, ఉత్సాహవంతులు పార్టీ పదవులను కట్టబెట్టి, సరికొత్త రూట్ లో వెళుతున్నట్లుగా కనిపిస్తున్నారు.అయితే ఇదంతా రాహుల్ ఒక్కడి గొప్పతనం కాదు.

ఇందులో రాజకీయ వ్యూహకర్త కిషోర్ రాజకీయ వ్యూహాలే ఎక్కువగా ఉన్నాయి.ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లతో భేటీ అయిన దగ్గర నుంచి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Advertisement

అయితే ప్రశాంత్ కిషోర్ కేవలం రాజకీయ వ్యూహాలు మాత్రమే అందించడం లేదని, ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు గానే ప్రచారం జరుగుతోంది.దాదాపుగా ప్రశాంత్ కిషోర్ చేరిక ఖాయమైన నేపథ్యంలో ఆయన చేరితే పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందనే విషయంపై ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బృందం రాహుల్ గాంధీ తో ఒక సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, కమల్ నాథ్, ఏకే ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుందని, పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు రచించగలరు అని, సీనియర్ నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.ప్రశాంత్ కిషోర్ కు ఎలాగూ బీజేపీపై కోపం ఉంది కాబట్టి, అది తమకు మేలు చేస్తుందని, ఆయన చేరితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మేలే ఎక్కువగా జరుగుతుంది అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు