కాంగ్రెస్‎వి హత్యా రాజకీయాలు..: బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

ఎన్నికలు జరగముందే కాంగ్రెస్ దాడులు చేస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు.ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంశంపై తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

గాంధీభవన్ సాక్షిగా సీట్లు అమ్ముకుంటున్నారన్న బాల్క సుమన్ కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణను అమ్మకానికి పెడతారని విమర్శలు చేశారు.తమ పార్టీకి సిట్టింగ్ ఎంపీపై దాడి చేయించారన్నారు.

కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు