రాచకొండను ఫిలిం సిటీ ప్రక్రియపై హర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండల పరిధిలో నల్లగొండ,రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో వేలాది ఎకరాలలో విస్తరించి ఉన్న రాచకొండను ఫిలిం సిటీ( Film City ) చేయడం గొప్ప శుభపరిణామమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఒకప్పుడు రాచరిక పాలనకు కేంద్ర బిందువైన రాచకొండను రాజధానిగా చేసుకొని రేచర్ల పద్మ నాయకులు 1961లో పరిపాలన చేశారని గుర్తు చేశారు.

రాచకొండ పచ్చగా కనిపించే గుట్టలతో అరకులోయలను మించిన అందాలు కలిగి ఉన్నాయని,కనుల విందుగా కనిపించే అందాలను తెలంగాణ సమాజానికి అందించుటకు కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy )కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్, కరంటోత్ శ్రీనివాస్ నాయక్,ఎండి నయిమ్ షరీఫ్,కోన్ రెడ్డి నరసింహ, జక్కిడి బాల్ రెడ్డి, రాచకొండ రమేష్ బాబు, ఉప్పల కృష్ణ,ఉప్పల నాగరాజు,జక్కల యాదయ్య,గోపాల్, లచ్చిరాం,నాను,మోహన్,శంకర్,రవీందర్,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నేతల అరెస్ట్

Latest Video Uploads News