టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ నేతలేనని ఆరోపించారు.
కవిత గెలుపు సాధిస్తే ఆధిపత్యం చేలాయిస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని తెలిపారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో రైతులతో నిజామాబాద్ లో నామినేషన్ వేయించింది బీజేపీనేనని విమర్శించారు.
కాంగ్రెస్ నామినేషన్ వేయిస్తే వాళ్లు బీజేపీలో ఎందుకు చేరతారని ఆయన ప్రశ్నించారు.







