స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకోగా మోక్షజ్ఞ కూడా బాలయ్య స్థాయిలో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మోక్షజ్ఞ కోసం ఎన్నో కథలను విన్న బాలయ్య ఆ కథలతో సంతృప్తి చెందలేదు.
తను సొంతంగా రాసిన కథతోనే మోక్షజ్ఞను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నారు.బాలయ్య మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేయగా ఈ సినిమా కోసం బాలయ్య కూతురు తేజస్విని కూడా పని చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య ఆలోచనలకు తేజస్విని తోడైతే మాత్రం సక్సెస్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఆదిత్య 999 సినిమాలో బాలయ్య కూడా ఉంటారని అయితే బాలయ్య పాత్ర పరిమితంగా ఉంటుందని తెలుస్తోంది.
బాలయ్య అడిగితే తేజస్విని ఈ సినిమా సక్సెస్ కోసం తన వంతు సహాయసహకారాలు అందిస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
తేజస్విని సహాయం లేకుండా ఆదిత్య999 ను తెరకెక్కిస్తే బాలయ్య కల పూర్తిస్థాయిలో నెరవేరదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విజువల్ ఎఫెక్ట్స్, ఇతర విషయాలకు సంబంధించి తేజస్విని సహాయసహకారాలు అందిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సోదరుని కోసం తేజస్విని కూడా తన వంతు హెల్ప్ చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లోకి వచ్చి సక్సెస్ సాధించారు.
మోక్షజ్ఞ కూడా ఈ జాబితాలో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.మోక్షజ్ఞకు కూడా సినిమాలపై బాగానే ఆసక్తి ఉందని తెలుస్తోంది.ఇతర స్టార్ హీరోలకు మోక్షజ్ఞ గట్టి పోటీనిస్తారేమో చూడాలి.
బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అత్యంత భారీ బడ్జెట్ తో వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.