బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ గత కొంతకాలం నుంచి ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ శిఖరే తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.నుపూర్ గతంలో అమీర్ ఖాన్ కు ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరించేవారు అనంతరం తన కుమార్తె ఐరా ఖాన్ కి కూడా ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా అందరితో పంచుకున్నారు.
ఇలా గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఐరా ఖాన్.నుపూర్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిచ్చితార్థం ఘనంగా జరిగినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నిశ్చితార్థ కార్యక్రమాలలో భాగంగా అమీర్ ఖాన్ తో పాటు తన మాజీ భార్యలు కూడా పాల్గొని సందడి చేశారు అలాగే అమీర్ ఖాన్ తల్లి మనవరాలు నిశ్చితార్థపు వేడుకలలో సందడి చేశారు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.







