కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది.ఈమధ్య ఇంగ్లీష్ మెడిషన్స్ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్న విషయం గురించి వినే వుంటారు.
ముఖ్యంగా చిన్న పిల్లల కోసం తయారు చేస్తున్న మందుల విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా డ్రగ్ రూల్స్‌ను కాస్త సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ రూల్స్ వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయని వినియోగదారులు గుర్తించండి.
కేంద్ర ప్రభుత్వం నిన్న అనగా నవంబర్ 18న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.డ్రగ్ రూల్స్ (8వ సవరణ) – 2022లో భాగంగా అల్లేగ్రా, కాల్పోల్, గెలుసిల్, బెటాడిన్, డోలో 650తో సహా టాప్ 300 డ్రగ్ ఫార్ములేషన్ ప్యాకేజింగ్ లేబుల్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ను తప్పని చేసింది.
ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా జనాలకు చాలా మేలు చేకూరనుంది.దాని వలన నకిలీ మెడిసిన్‌ను చాలా ఈజీగా గుర్తించవచ్చు.కాగా ఈ కొత్త డ్రగ్ రూల్స్ ఆగస్ట్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొనడం విశేషం.

క్యూఆర్ కోడ్ సాయంతో మెడిసిన్ తయారీ చేసిన ప్రొడక్షన్ కోడ్, డగ్స్ సాధారణ పేరు, అలాగే బ్రాండ్ పేరు, మరియు తయారీదారు పేరుకూడా ఈజీగా తెలుసుకోవచ్చు.అంతేకాకుండా చిరునామా, బ్యాచ్ నంబర్, మ్యానిఫ్యాక్చరింగ్ తేదీ, ఎక్స్‌పైయిరీ డేట్ (గడువు తేదీ) లైసెన్స్ నంబర్ వంటి డేటా వివరాలు కూడా తెలుసుకునే వెసులుబాటు కలదు.కాగా, నకిలీ మెడిసిన్ లేదా సిరప్‌ల అమ్మకాల్ని అరికట్టేందుకు అమెరికా, రష్యా, జర్మనీ, బ్రిటన్ తోపాటు ఇతర ఫారిన్ దేశాల్లో ఈ క్యూఆర్ కోడ్ ఇప్పటికే అమల్లో వుంది.
ఇప్పటి వరకు ఇక్కడ లేకపోవడం దురదృష్టకరం.అయితేనేం మోడీ తాజాగా ఈ లేటెస్ట్ టెక్నాలజీని వినియోయించాలని తెలుపుతూ ఆజ్ఞాపించాడు.







