కాంగ్రెస్ అవినీతికి ప్రతిరూపం: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!!

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.

ఈరోజు అవిశ్వాస తీర్మానంపై అధికార బిజెపి పార్టీ నేతలు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య కాస్త వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ ( Rahul gandhi ) మరియు కేంద్రమంత్రి ఇరానీ మధ్య కాస్త వాడి వేడి వాతావరణం కొనసాగింది.ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని సభాముఖంగానే స్మృతి ఇరానీ తెలియజేయడం అందరిని షాక్ కు గురి చేసింది.

రాహుల్ గాంధీ "స్త్రీ ద్వేషి " అంటూ మాట్లాడింది.అంతేకాకుండా భరతమాతను చంపారు అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

మణిపూర్ ను ఎవరూ కూడా విభజించలేరని స్పష్టం చేసింది.మణిపూర్ ( Manipur ) రాష్ట్రం కూడా భారత్ లో అంతర్భాగమే అని భరతమాతను హత్య చేశారని కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుచుకుంటున్నారని, 1984 అల్లర్లు,కాశ్మీర్ హింసను స్మృతి ఇరానీ గుర్తు చేశారు.ఇప్పటికే అక్కడ జరిగే అల్లర్లను 370 ఆర్టికల్ ద్వారా రద్దుచేసి శాంతిని నెలకొల్పిన ఘనత మాదని తెలియజేసింది.

Advertisement

దేశంలో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ఉన్న సమయంలో అవినీతి రాజ్యమేలిందని, కాంగ్రెస్ అంటేనే అవినీతి అని స్మృతి ఇరానీ ( Smriti irani ) ప్రస్తావించింది.కాంగ్రెస్ అవినీతికి ప్రతిరూపమని అన్నది.కాశ్మీర్ ప్రజల బాధలు కాంగ్రెస్ ఎప్పుడు పట్టించుకోలేదని, ఎమర్జెన్సీ టైంలో జరిగినటువంటి సంఘటన గురించి మరోసారి ప్రస్తావించింది.

అలాగే రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ.మీరు ఇండియాలో భరతమాతను హత్య చేశారని అన్నారు.

మీరు దేశభక్తి ముసుగులో ప్రజలను మోసం చేసే దేశద్రోహులంటూ మండిపడ్డారు.మణిపూర్ ప్రజలను చంపడమే కాదు మీరు దేశాన్ని కూడా చంపుతున్నారని తెలియజేశారు.

మీరంతా కలిసి హిందుస్థాన్ (( Hindustan ) ను మర్డర్ చేశారంటూ రాహుల్ కూడా తీవ్రంగా ఖండించారు.ప్రస్తుతం వీరిద్దరి మధ్య సాగినటువంటి సంభాషణ వార్తల్లో హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు