ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు షాకిచ్చిన అధిష్టానం!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ ఇచ్చింది. కోమటిరెడ్డి ప్రస్తుతం భునగిరి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.

చాలా కాలం నుండి టీపీసీసీ నియమాకంపై గుర్రుగా ఉన్న వెంకట్ రెడ్డి.పార్టీ వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

 దీంతో ఆయనపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కీలకమైన ప్యానెల్స్ నుంచి ఆయన పేరును పార్టీ తొలగించింది.

 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శనివారం రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (పీఈసీ), రాష్ట్ర స్థాయి నిర్ణయాధికార కమిటీలను నియమించింది. ఈ ప్యానెళ్లలో కోమటిరెడ్డి పేరు ఎక్కడా లేకపోవడంతో పలువురిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజరయ్యారు, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి టికెట్ పై పోటీ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వెంకట్ రెడ్డి కూడా చురుగ్గా పాల్గొనలేదు.

 ఇలా కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో  యాక్టివ్‌గా లేరు.ఇక మరో నేత విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇదే వైఖరి వ్యక్త  పరిచింది.

  కర్ణాటకకు ఇంచార్జిగా ఉన్న ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు విషయంలోనూ పట్టీపట్టనట్లు గా వ్యవహరించింది.తన పేరును పిఎసి, పిఇసిలోని స్థానాన్ని ప్రస్తుత సీనియర్ నాయకులతో భర్తీ చేయాలని కోరారు. 

ప్యానెల్‌లో లేని  సీనియర్ నాయకుడి స్థానంలో తన పేరును భర్తీ చేయాలని శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు తెలిపారు.అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు తాను సూచించిన పేర్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో శ్రీధర్‌బాబు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డిని రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల నుంచి తప్పించారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

 కాగా రాష్ట్ర ఆఫీస్ బేరర్‌లలో పీఆర్‌జే కుమార్తె, విష్ణు సోదరి విజయారెడ్డిని నియమించారు. తన సోదరి పి.విజయారెడ్డితో మాట్లాడకుండా, వ్యతిరేకిస్తున్న విష్ణుకు ఈ చర్య వ్యవహారం నచ్చలేదు.

Advertisement

తాజా వార్తలు