కాంగ్రెస్ లో కలవరమే.. నో డౌట్ !

నిన్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే.

రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో బిజేపీ ( BJP )విజయం సాధించగా.

తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది.ఇక మిగిలింది మిజోరాం మాత్రమే ఆ రాష్ట్ర ఫలితాలు కూడా నేటితో తేలిపోనున్నాయి.

అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు కనీసం నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో వ్యూహరచన చేశాయి.ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగానే దృష్టిపెట్టాయి ఈ రెండు పార్టీలు.

అయితే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు గట్టిగానే కాన్ఫిడెన్స్ చూపుతూ వచ్చారు.ఎందుకంటే రాజస్తాన్ లో ఆల్రెడీ హస్తంపార్టీ అధికారంలో ఉండడంతో మరోసారి ప్రజలు కాంగ్రెస్ వైపే నిలుస్తారని భావించారంతా.అటు ఛత్తీస్ ఘడ్ మరియు తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేల్చిచెప్పాయి.

Advertisement

ఇక మధ్య ప్రదే( Madhya Pradesh )శ్ లో మాత్రం హోరాహోరీ తప్పదనే వాదన నడిచింది.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బిజేపీ విజయం సాధించగా, తెలంగాణ( Telangana ) మాత్రమే హస్తం పార్టీ సొంతమైంది.

దీంతో నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటలని భావించిన హస్తం నేతలకు కేవలం ఒక్కే ఒక్క రాష్ట్రం మాత్రమే అనుకూలమైంది.కనీసం మూడు రాష్ట్రాల్లో హస్తం పార్టీ విజయం సాధించి ఉండే ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.పైగా ఈ ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పై పడే అవకాశం ఉండనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నామాట.

ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అటు బిజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు కీలకమే.ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ సత్తా చాటడం కాంగ్రెస్ ను కలవర పెట్టె అంశం.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు