శ్రీదేవి కి షరతులు వర్తిస్తాయన్న బాబు ?

బాపట్ల నియోజకవర్గంలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి( Vundavalli Sridevi ) గత కొంతకాలం క్రితం రాష్ట్రవ్యాప్తంగాచర్చ నీయాంశం గా మారారుపార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ కాబడిన శ్రీదేవి జగన్ ( CM jagan )పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఆమె వ్యాఖ్యలకు తెలుగుదేశం అనుకూల మీడియాలో బాగా ప్రాధాన్యం కూడా లభించింది .

 Conditions Apply To Sridevi, Vundavalli Sridevi, Chandrababu , Shravan Kumar , C-TeluguStop.com

ఇక ఆమె తెలుగుదేశంలో చేరటం లాంచన మే అంటూ వార్తలు వినిపించాయి.ఆ దిశగా ఆమె చంద్రబాబుతోను లోకేష్ తోను సమావేశం అయ్యి టికెట్పై హామీ తెచ్చుకున్నారని వార్తలు వచ్చాయి .

Telugu Chandrababu, Cm Jagan, Nandigamsuresh, Shravan Kumar, Tdp-Telugu Politica

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తాడికొండ నుంచి గాని పత్తిపాడు నుంచి గాని అసెంబ్లీ టికెట్ ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం లేనట్లుగా తెలుస్తుంది.ఆ ఆ రెండు సీట్లలో ఏదో ఒకదానిని ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసినప్పటికీ తాడికొండ నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్( Shravan Kumar ) కి ఇప్పటికే టికెట్ కన్ఫామ్ చేసినందున అది సాధ్యపడటం లేదు .అంతేకాకుండా పత్తిపాడు నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నప్పటికీ అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు కు ఇప్పటికే హామీ ఇచ్చినందున అది కూడా సాధ్యపడకపోవచ్చు అని తెలుస్తుంది.

Telugu Chandrababu, Cm Jagan, Nandigamsuresh, Shravan Kumar, Tdp-Telugu Politica

అయితే శ్రీదేవికి బాపట్ల లోక్సభ నుంచి బరిలోకి దింపే ఆలోచన చంద్రబాబుకు ఉందని 2019 ఎన్నికల్లో అక్కడి వైసీపీ నుండి నందిగామ సురేష్ విజయం సాధించారు. నందిగం సురేష్( Nandigam Suresh Babu ) తో శ్రీదేవికి కూడా సుదీర్ఘకాలం పాటు వ్యక్తిగత విభేదాలు ఉన్నందున ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తే రాజకీయ పోటీగా కూడా ఇది మారే అవకాశం ఉంది.నందిగాం సురేష్ పై పోటీకి శ్రీదేవి కూడా సిద్ధమైతే పోటీ రసవత్తరం గా మారే అవకాశం ఉంది.

అయితే ఎమ్మెల్యే పదవి పైనే ఆశపడుతున్న ఉండవల్లి శ్రీదేవి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube