సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి థియేటర్లలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాల మధ్య ఏకంగా పది పోలికలు ఉండటంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ పోలికల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం. చిరు, బాలయ్యల నటన ఈ రెండు సినిమాలకు హైలెట్ గా నిలిచింది.
వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ డైరెక్టర్ కాగా వీరసింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు అనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాలో నటించిన హీరోలకు వీరాభిమానులు కావడం గమనార్హం.
వాల్తేరు వీరయ్య టైటిల్ లో, వీరసింహారెడ్డి టైటిల్ లో వీర కామన్ గా ఉండగా ఈ రెండు సినిమాలు ఊరమాస్ ప్రేక్షకులను, మాస్ ప్రేక్షకులను మెప్పించడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ రెండు సినిమాలకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కాగా ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ ఈ రెండు సినిమాలకు పని చేసి మెప్పించారు.
వీరసింహారెడ్డి సినిమాలో సవతి చెల్లి పాత్ర కీలకం కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో సవతి తమ్ముడు పాత్ర హైలెట్ గా నిలిచింది.
అయితే వీరసింహారెడ్డి సినిమాలోని సవతి చెల్లి పాత్ర, వాల్తేరు వీరయ్య సినిమాలోని సవతి తమ్ముడు పాత్ర చనిపోతాయి.
ఈ రెండు సినిమాలలో విలన్స్ తల తెగిపడటం కామన్ గా ఉంటుంది
ఈ రెండు సినిమాలను నిర్మించింది ఒకే బ్యానర్ అనే సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలలో కొన్ని సీన్లను విదేశాల్లో షూట్ చేయడం గమనార్హం.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ కాగా రెండు సినిమాలలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
ఈ రెండు సినిమాలలోని ఫస్ట్ యాక్షన్ సీన్ ను గమనిస్తే వీరసింహారెడ్డిలో ఓడపై యాక్షన్ సీన్ ను షూట్ చేయగా వాల్తేరు వీరయ్యలో పడవపై యాక్షన్ సీన్ ను షూట్ చేశారు.