సాధారణంగా థియేటర్లో విడుదలైన సినిమాలన్నీ కూడా అనంతరం ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఇలా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల కాగా మరికొన్ని సినిమాలు థియేటర్లో విడుదలయ్యి థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి.
ఇక సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాకి వచ్చిన టాక్ ఆధారంగా లేదా సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఆధారంగా ఓటీటీ సమస్థలు ఆ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తుంటాయి.
అయితే నాని నటించిన దసరా సినిమా విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.
నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం దసరా ఈ సినిమా మార్చి 30 వ తేదీ విడుదల కాబోతోంది.సింగరేణి బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కి 30వ తేదీ మార్చి అన్ని భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసుకుంది.ఈ సినిమా అన్ని భాషలలోనూ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది.
అయితే ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా తెలియజేసింది.

ఈ సినిమా విడుదలైన 45 రోజుల అనంతరం ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.దసరా సినిమా తర్వాత నాని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారు.నాని 30 కు నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాలో నాని సరసన సీతారామం నటి మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.







