సుకుమార్ చంద్రశేఖర్ యేలేటి లో ఉన్న కామన్ పాయింట్ ఇదే ..!

సుకుమార్ ( Sukumar ) గురించి ఇప్పటికే ఎన్నో ఆర్టికల్స్ మనం చూస్తూనే ఉన్నాం.

అయన సినిమా గురించి ఆలోచించే విధానం ప్రతి సారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

అలాగే సుకుమార్ హీరోలు కూడా సినిమా లో అనిపించే తీరు మిగతా హీరోలకు ఎంతో బిన్నంగా ఉంటాయి.సుకుమార్ హీరోలు లాజికల్ థింకింగ్ తో ఉంటారు.

పైగా వారిలో వారే స్ట్రగుల్ అవుతూ ఉంటారు.ప్రేమ ను త్యాగం చేస్తారు.

కుటుంబం కోసం రివెంజ్ కి వెళ్తారు.ఈ అంశాలను కథలుగా మలిచి ఎన్నో సినిమాలు వచ్చినప్పటికి సుకుమార్ సినిమాల లాగ ప్రభావాన్ని చూపించలేదు.

Advertisement

పైగా సుకుమార్ సినిమాలు ఒక ఆర్ట్ ఫామ్ తో వస్తూనే కమెర్షియల్ గా కూడా ఉండి బాక్స్ ఆఫీస్ ( Box Office ) వద్ద కలెక్షన్స్ కురిపిస్తూ ఉంటాయి.

అందుకే సుకుమార్ తో సినిమా చేయాలనీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు.ఇప్పుడు పుష్ప ( Puspa )సీక్వెల్ తో బిజీ గా ఉన్న సుకుమార్ మరిన్ని సంచలనాలు నమోదు చేస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఇక సుకుమార్ లాగ ఆలోంచించి అతడికి సమకాలికులైన దర్శకులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఒక్క చంద్రశేఖర్ యేలేటి ( Chandra sekar yeleti )మాత్రమే.

అయన సినిమాలు కూడా చాల భిన్నమైనవిగా ఉంటాయి.అలాగే సినిమాలో హీరోలు కూడా ఆలోచింపచేసే విధంగా ఉంటారు.2003 నుంచి ఇప్పటి వరకు కేవలం 8 సినిమాలు మాత్రమే తీసిన చంద్రశేఖర్ యేలేటి ప్రతి సినిమా కూడా ఎంతో ఇంటెన్స్ తో తీయడం విశేషం.అయన మొదటి సినిమా అయితే హిందీ లో కూడా తెరకెక్కి విజయం సాధించింది.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

అనుకోకుండా ఒక రోజు, సాహసం, మనమంతా సినిమాలు చూస్తునంత సేపు మనం కూడా కథలో లీనమైపోయి ఎదో ఒక పరిశోధన చేస్తున్నాం అనే విధంగా ఉంటాయి.అయితే చంద్ర శేఖర్ యేలేటి ఒక్క సినిమా కూడా కమెర్షియల్ యాంగిల్ లో తీయలేదు.అయన హీరోలు పెద్ద పెద్ద స్టార్స్ కారు.

ఆయన తీసిన సినిమాల్లో గోపి చంద్( Gopi chand) మరియు చివరి సినిమా చెక్ లో నితిన్ ( Nithin)తప్ప మిగత అంత కథ మాత్రమే హీరో గా భావించి తెస్తూ వచ్చాడు అలాగే విజయాలు కూడా సాధించాడు.

తాజా వార్తలు