పాన్ ఇండియా సినిమాల్లో మాకు అవకాశం ఇవ్వరు.. పృథ్వీ రాజ్

తెలుగు సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి కమెడియన్ గా నిలిచాడు.

1993లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఖడ్గం సినిమాతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో బాగా నవ్వించాడు.

ఇక బయట కూడా తన మాటలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు.ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇవ్వరు అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు.

నిజానికి పృథ్వీ సినిమాల్లోనే కాకుండా బయట కూడా తను మాట్లాడిన మాటలతో తెగ ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటాడు.ఇక తన నోటికొచ్చినట్లు మాట్లాడటంతో కొన్ని హోదాలు కూడా కోల్పోయాడు.

Advertisement

పలువురు స్టార్ హీరోల గురించి చాలాసార్లు వ్యతిరేకంగా మాట్లాడాడు.ఇక రాజకీయాల్లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.

కొన్ని కారణాలవల్ల సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోయాడు.

ఇక గతంలో పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ విషయంలో తన దూకుడును తగ్గించాడు.అంతేకాకుండా ఆయనను ఉద్దేశించి పాజిటివ్ గా మాట్లాడటం ప్రారంభించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఎమ్ ఎన్ వీ సాగర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కాలం రాసిన కథలుఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి పాల్గొనగా కొన్ని విషయాలు పంచుకున్నాడు పృథ్వీరాజ్.పాన్ ఇండియా సినిమాల ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలవరు అంటూ నన్ను పిలిచినా సినిమాలకు సపోర్టు అందించాలని ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యాను అంటూ తెలిపాడు.సినిమాలలో చిన్న పెద్ద అనేది ఉండదంటూ.

Advertisement

ఏ సినిమాకైనా ఒకే కెమెరా, ఒకే కష్టం ఉంటుందని కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు