అలీ కూతురి పెళ్లి వీడియో మీరు చూశారా.. కూతురు ఎమోషనల్ అవ్వడంతో?

ప్రముఖ కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లి గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లికి హాజరు కాకపోయినా రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అలీ సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉన్నారు.

అయితే ఫాతిమా పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియొను జుబేదా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేశారు.పెళ్లి తర్వాత తల్లీదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉండటంతో ఫాతిమా ఎమోషనల్ అయ్యారు.

పెళ్లికి సంబంధించి జరిగిన అన్ని కార్యక్రమాలను ఈ వీడియోలో ఉండేలా అలీ జాగ్రత్తలు తీసుకున్నారు.అలీ ఈ పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Advertisement

డెకరేషన్ గ్రాండ్ గా చేయడంతో పాటు పెళ్లి కూతురి డ్రెస్ లో ఫాతిమా మరింత అందంగా కనిపించడం గమనార్హం.ఫాతిమా స్నేహితులు, బంధువులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు.

మంత్రి రోజా కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు.అక్కినేని అమల, అక్కినేని నాగార్జున పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది.ఖర్చు విషయంలో అలీ ఏ మాత్రం రాజీ పడలేదని ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది.

ఈ యూట్యూబ్ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఫాతిమా కొన్ని క్షణాల పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ వీడియోకు కేవలం 9 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

నెటిజన్లు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫాతిమా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు