పండ్లు, కూరగాయలు చెడిపోకుండా సులభంగా స్టోర్ చేసుకునే కోల్డ్ స్టోర్..!

రైతులు సంవత్సరం పొడుగునా కష్టపడి పండించిన కూరగాయలు,పండ్లు ( Vegetables ,fruits )ఎలా స్టోర్ చేయాలో తెలియక దాదాపు 40 శాతానికి పైగా చెడిపోతున్నాయి.

పంట కోతకు వచ్చే సమయానికి కొన్ని పొలంలో రాలి ఎండిపోతే, పంట కోత తరువాత అమ్మడానికి ముందే కొన్ని పాడవుతూ ఉండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

కాబట్టి పంట తర్వాత అమ్ముడయ్యే వరకు పంటను స్టోర్ చేసి చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం వస్తుంది.లేదంటే సంవత్సరం పొడుగునా కష్టపడి పండించిన పంట చేతికి వచ్చాక చెడిపోయి నష్టాన్ని మిగిలిస్తుంది.

బీహార్ ( Bihar )కు చెందిన ఓ ఐఐటి విద్యార్థి కూరగాయలను, పండ్లను స్టోర్ చేసుకునే కోల్డ్ స్టోర్( Cold store ) ను తక్కువ ఖర్చుతో రూపొందించాడు.ఈ కోల్డ్ స్టోర్ లో కూరగాయలు, పండ్లు ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు పాడు అవ్వవు.

దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Advertisement

అసలు కూరగాయలు, పండ్లు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఉష్ణోగ్రతలో మార్పులు.ఈ పంటలు చెడిపోకుండా ఉండాలంటే సమానమైన ఉష్ణోగ్రత ఉండాలి.ఈ విద్యార్థి తయారుచేసిన సరికొత్త పరికరం పేరు సబ్జీ కోటి( Subji koti ).ఈ పరికరం ప్రత్యేకత ఏమిటంటే నీటిని ఆక్సిడ్ చేసి నీటి ఆవిరిగా, హైడ్రోజన్, కార్బోన్ది ఆక్సైడ్ గా మారుస్తుంది.తద్వారా ఈ పరికరం లోపల అంతా సమాన ఉష్ణోగ్రత ఉంటుంది.

ఈ సబ్జీ కోటి లో ఎటువంటి హానికరమైన కెమికల్స్ వాడలేదు.కాబట్టి ఇందులో ఎన్ని రోజులు నిల్వ ఉంచిన కూడా కూరగాయలు చెడిపోవు.పైగా ఇందులో పండ్లు స్టోర్ చేసినప్పుడు ఎంత బరువుతో ఉంటాయో ఎన్ని రోజులైనా బరువులో మార్పు ఉండదు.

ఇంకా ముఖ్యంగా ఈ పరికరం లోపలికి ఎటువంటి పురుగులు, వ్యాధి కారకాలు చేరవు.ఈ పరికరానికి ఎంత ఉష్ణోగ్రత( temperature ) కావాలంటే అంత ఉష్ణోగ్రత సెట్ చేసుకోవచ్చు.

ఈ పరికరాని ఒక చోట నుండి మరొక చోటికి సులువుగా తీసుకోవచ్చు.ఎటువంటి వాతావరణ పరిస్థితులైన ఈ పరికరం ఉపయోగించుకోవచ్చు.బయట ఉండే కోల్డ్ స్టోరేజ్ లలో పంటను నిల్వ చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని రోజు బాధపడుతున్న స్టార్స్ వీరే !

అలా కాకుండా ఇందులో అయితే తక్కువ ఖర్చుతోనే స్టోర్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు