తెలుగు పరిశ్రమలో నెలకొన్న సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకుని పరిష్కారం చూపాలని ప్రముఖ హీరో చిరంజీవి కోరారు.ఆదివారం ఓ సినిమా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడారు.
కొద్ది రోజులుగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు సినీ పరిశ్రమ కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే సక్సెస్ రేటు 20 శాతం మాత్రమే ఉందని, ఈ 20 శాతానికే సినీ పరిశ్రమ చాలా బాగుంటుందని అంతా అనుకుంటున్నారని అన్నారు.అయితే సినీ పరిశ్రమలో ఇబ్బందులు పడేవారు.
రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగానూ.పరోక్షంగానూ.
వేల మంది ఉన్నారని ఆయన చెప్పారు.
ఇలాంటి వారు అందరూ కలిస్తేనే సినీ పరిశ్రమ తప్ప ఐదుగురు హీరోలు.
ఐదు మంది డైరెక్టర్లు.ఐదారు మంది నిర్మాతలు కలిస్తే కాదు సినిమా ఇండస్ట్రీ అని ఆయన తెలిపారు.ఇల్లంతా బాగున్నారు కదా. అనేది ఇక్కడ కరెక్ట్ కాదన్నారు.మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఇక్కడ వర్తిస్తుందన్నారు.ఈ మధ్య కరోనాతో సినీ పరిశ్రమ గురించి సుస్పష్టంగా తెలిసిందన్నారు. నాలుగైదు నెలలు షూటింగ్ ఆగిపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది తమ కళ్ళారా చూశామన్నారు.తమకు తోచినట్లుగా హీరోలు ఇండస్ట్రీలోని పెద్దల సహకారంతో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి మూడు నాలుగు నెలల వరకు వారికి సరిపోయే విధంగా గ్రాసరీస్ అందించగలగామన్నారు.
ఆ తర్వాత లక్కీగా షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయి అంతా కాస్త ట్రాక్ లోకి వచ్చారు అన్నారు.కానీ ఒక షూటింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఎంతగా అల్లాడిపోయిందో అనే విషయం ఈ సందర్భంగా చెప్పదలిచాను కాబట్టి ఇండస్ట్రీ నిత్యం పచ్చగా ఉందనుకుంటే పొరపాటు అని అన్నారు.

ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినీ పరిశ్రమ అని గర్వంగా చెప్పగలనని ఆయన అన్నారు.ఆలాంటి పరిశ్రమ ఈరోజు సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.సినీ నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడానికి వీలులేకుండా పోయింది అన్నారు.ఇప్పటికీ నారాయణ దాస్ నేతృత్వంలో రెండు ప్రభుత్వాలతో చర్చించడం జరిగిందన్నారు నిర్మాణ వ్యయం పెరిగినప్పుడు రెవెన్యూ రావడంలేదనే అంశాన్ని చర్చల్లో ప్రస్తావించడం జరిగిందన్నారు.
మనం ఏ వస్తువైనా చూసికోంటామని, కూరగాయలు వంటివి కూడా బాగుంటేనే కొంటామని కానీ టికెట్ మాత్రం కొన్న తర్వాత చూసేది సినిమా మాత్రమేనని ఆయన అన్నారు.అలా ప్రేక్షకులు ఎందుకు చూస్తారు అంటే తమ మీద ఉన్న నమ్మకంతోనని ఆయన అన్నారు.
తమ మీద ఎంతో నమ్మకంతో వచ్చి వారిని డిజప్పాయింట్ చేయకూడదనే కష్టపడుతూంటామని అన్నారు.