ఆలేరులో సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లా:మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అక్రమ సస్పెన్షన్ నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ ఆలేరు మండల మరియు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం బస్టాండ్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మరియు పట్టణ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ జగదీష్ రెడ్డిపై అక్రమ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేసి సభలోకి స్వాగతించాలని డిమాండ్ చేశారు.

లేనియెడల సస్పెన్షన్ ఎత్తివేసేదాకా తమ నిరసన పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల,పట్టణ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

CM Revanth Reddy Effigy Burnt In Aleru, CM Revanth Reddy , Aleru, Yadadri Bhuvan
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి

Latest Yadadri Bhuvanagiri News