హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో ఆయన మాట్లాడారు.
అనంతరం సంస్థ కార్యలాపాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈక్రమంలోనే సోలార్ వాహనంలో తిరుగుతూ వివిధ బ్లాకులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.ఎంసీఆర్ హెచ్ఆర్డీని క్యాంపు కార్యాలయంగా మార్చాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్డీని సందర్శించారని సమాచారం.