లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆకర్షించే పనిలో పడింది.ఇందులో భాగంగా బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి( Former MP Jithender Reddy ) నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్( Congress ) లోకి ఆహ్వానించారు.కాగా సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.దీంతో ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్ గిరి ఎంపీ( Malkajgiri MP ) స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి టికెట్ ఆశించగా.అధిష్టానం టికెట్ ను డీకే అరుణ( DK Aruna )కు ఇవ్వడంతో ఆయన కాస్త అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భేటీ చర్చనీయాంశంగా మారింది.